భారీగా పెరిగిన టాటా స్టీల్స్‌ షేర్లు

Tata Steel
Tata Steel

ముంబయి: ప్రముఖ సంస్థ టాటా మెటాలిక్స్‌ షేర్ల నేడు మార్కెట్లలో భారీగా ర్యాలీ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు షేరు ధర సుమారు. 6 శాతం పెరిగింది. ఈ కంపెనీ దాదాపు రూ.403.79 కోట్లు విలువైన ఈక్విటీ , కన్వర్టబుల్‌ షేర్లను తన మాతృసంస్థ టాటా స్టీల్స్‌కు కేటాయించింది. ఈ నిర్ణయం కొనుగోలుదార్లలో నమ్మకాన్ని పెంచింది. ఈ డీల్‌ కింద టాటాస్టీల్‌ 27.97 లక్షల షేర్లను రూ.642 రేటు వద్ద కొనుగోలు చేసింది. దీంతో కంపెనీలో టాటాస్టీల్‌ వాటాలు 50.09శాతం నుంచి 55.06శాతానికి పెరిగాయి. ఉదయం 9.26 సమయానికి టాటా మెటాలిక్స్‌ రూ.667 వద్ద ట్రేడవుతోంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/