నిరాశపరచిన టాటామోటార్స్‌

TATA--
TATA-

నిరాశపరచిన టాటామోటార్స్‌

న్యూఢిల్లీ: దేశీయ ఆటో రంగ కంపెనీల అయిన టాటామోటార్స్‌ మార్కెట్లు ముగిశాక ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రెండవ త్రైమాసి కంలో రూ.1048కోట్ల నికర నష్టాన్ని ప్రకటిం చింది. మొత్తం ఆదాయం రూ.72,112కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.5268కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 7.4శాతానికి చేరాయి. కాగా స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ.109కోట్ల నికరలాభం సాధించింది. ఆదాయం రూ.17,759కోట్లు కాగా, ఇబిటా రూ.1097కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 6.2శాతంగా నమోదయ్యాయి. అలాగే లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జెఎల్‌ఆర్‌ రెండ వ త్రైమాసికంలో 563.5కోట్ల పౌండ్ల నికర లాభం పొందింది. ఇబిటా మార్జిన్లు 9.1శాతంగా నమోదయ్యాయి. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేయడంతో వీటి ప్రభావం గురువారం షేరుపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బుధవారం ట్రేడింగ్‌ టాటామోటా ర్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఇలో 0.8శాతం పుంజుకొని రూ.179 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.180నుంచి 173మధ్య ఊగిసలాడింది.