సన్‌ఫార్మాపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

sun pharma
sun pharma

న్యూఢిల్లీ: సన్‌ఫార్మా సంస్థకు సంబంధించి 2016 మార్చి 31వ తేదీనుంచి 2017 మార్చి 31వ తేదీవరకూ జరిగిన ఆర్ధిక కార్యకలాపాలపై సెబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించిందని సంస్థ స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదికి చ్చింది. అలాగే 2018 మార్చి 31వ తేదీవరకూ జరిగిన లావాదేవీలనుసైతం ఆడిట్‌చేయాలని ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కొనసాగుతున్నదని వెల్లడించింది.

అయితే ఎలాంటి లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించిందన్న అంశానికి సంబంధించి సన్‌ఫార్మా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వ్యక్తులు, సంస్థలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంటే మొత్తం ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను సమగ్రపరిశీలనచేయడం, ఈ లావాదేవీల పరిశీలన అవసరమైతే ఒక కోర్టు లేదా చట్టపరిధిలో లేక న్యాయపరమైన వివాదాల్లోసైతం వినియోగపడే విధంగా ఉంటుంది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించినా సంస్థ షేర్లు 1.30శాతంపెరిగి 431.95 రూపాయలుచొప్పునట్రేడ్‌ అయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/