11నెలల కనిష్టానికి చక్కెర విశ్వవిపణి ధరలు!

Sugar Prices
Sugar Prices

న్యూఢిల్లీ: చక్కెరధరలు 11నెలల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచంలో అత్యధి కంగా చక్కెర ఉత్పత్తిచేసే బ్రెజిల్‌ దేశం నుంచి నిల్వలు పేరుకోవడం కూడా మార్కెట్లకు గట్టిపోటీ ఇస్తోంది. ధరలు తగ్గడానికి కారణం కూడా భారత్‌పైనే ప్రపంచదేశాలు నెట్టివేస్తున్నాయి. భారత ప్రభుత్వ విధానాలు, ఎగుమతి కోటాలకు ప్రకటిస్తున్న చక్కెర సబ్సిడీలు రాయితీలు ఇతర ప్రపంచ దేశాల ఉత్పత్తిదారులు ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్‌చేసే స్థాయికి పెరిగింది. ఈ వివాదం పెరిగి పెరిగి అంతర్జాతీయ స్థాయికి చేరింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో ఈమేరకు భారత్‌ను నవంబరులో పర్యటించ నున్నారని భారత్‌ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉందని అంతర్జాతీయ చక్కెర సంఘం ఒక నివేదిక వెల్లడించింది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ ప్లాట్స్‌ ఆరో వార్షిక సమా వేశంలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆదివారం మియామిలో ఈ సదస్సు ప్రారంభించారు. ముడిచక్కెర ధరల ఫ్యూచర్స్‌లో 8.4శాతం దిగ జారి 11.2 సెంట్లకు పడిపోయింది. వరుసగా మూడోసారి తగ్గినట్లు కనిపిస్తోంది.చక్కెరను చిన్న మొత్తంలో ఉత్పత్తిచేసే గ్వాటెమాల, ఎల్‌సాల్వ డార్‌ వంటి దేశాలు కూడా ఈ ఎగుమతుల ప్రభావానికి లోనయ్యాయి. కరెన్సీలో అనిశ్చితి ఆధారంగా ఉంటుందని మెక్‌డౌగల్‌ వెల్లడించారు. సిటీగ్రూప్‌ ఇంక్‌ భారత్‌ విధానాన్ని పునఃసమీ క్షించుకోవాల్సి ఉంటుందని వ్లెలడించింది. సిటి గ్రూప్‌ సరఫరాలోటు 12నెలల్లో 7.2 మిలియన్‌ టన్నులకు చేరిందని అంచనా. భారత్‌ 28 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తుండగా 15శాతం తగ్గిందని చెపుతోంది. కరెన్సీ మార్కెట్లలో డౌన్‌గ్రేడింగ్‌ కూడా ఇందుకు కొంత కారణం అయింది. చక్కెర మిల్లులు ఐదు మిలియన్‌ టన్నులను 2018-19 నిల్వలకు సంబంధించి ఎగుమతులకు ప్రణాళికలు వేసాయి. ఆగస్టు నెల చివరికి 3.8 మిలియన్‌ టన్నులకు పెరిగింది.