భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 2,476… నిఫ్టీ 708

sensex
sensex

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుందన్న ఆశలు మదుపర్లకు కొత్త ఊరటనిచ్చాయి. యూరప్‌లో సైతం కరోనా మరణాలు తగ్గుముఖం పట్టడంతో యురోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను చవిచూశాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 2,476 పాయింట్ల లాభంతో 30,067 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 708 పాయింట్ల లాభంతో 8,792 వద్ద స్థిరపడింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/