భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 1,203… నిఫ్టీ 343

sensex today
sensex today

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుండడం, మరణాల సంఖ్య పెరగడం, ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో మదుపరులు ఎక్కువగా అమ్మకాలకు మొగ్గు చూపుతుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,203 పాయింట్ల నష్టంతో 28,265 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 343 పాయింట్ల నష్టంతో 8,253 స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.55 గా ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/