వరుసగా రెండో రోజు లాభాలు

సెన్సెక్స్‌ 1861.75.. నిఫ్టీ 516.80

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. కేంద్రం ఉద్దీపనలు ప్రకటిస్తుందనే ఆశలకు తోడు, అమెరికాలో ప్యాకేజి అంశం నేడు మార్కెట్‌లకు ఊతమిచ్చాయి. దీనితో సూచీలు లాభాల వైపు పయనించాయి. సెన్సెక్స్‌ 1861.75 పాయింట్లు లాభపడి 28,535.78 వద్ద, నిఫ్టీ 516.80 పాయింట్లు లాభపడి 8,317 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 75.88 గా ఉంది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/