భారీ నష్టాల్లో మార్కెట్లు

stock market
stock market


ముంబై: కేంద్ర బడ్జెట్‌ ప్రతికూలతలు, ఆసియా మార్కెట్లు బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఆరంభంలో బిఎస్‌ఈ 400పాయింట్లకు పైగా పతనమవగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,700 మార్క్‌ను కోల్పోయింది. ఉదయం సెన్సెక్స్‌ 402 పాయింట్లు నష్టపోయి 39,111 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 11,687 వద్ద ట్రేడవుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.58గా కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/