స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం ఆరంభమైన సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 38,837 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11,660 వద్ద ట్రేడవుతుంది. నేడు ట్రేడింగ్‌లో రూపాయి 10 పైసలు బలపడి 69.07 వద్ద కొనసాగుతుంది. అర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయనుండడంతో డాలర్ల రాకపెరిగే అవకాశం ఉంది. ఈ డీల్‌ విలువ సుమారు 7 బిలియన్‌ డాలర్లు ఉండవచ్చు. దీంతో డాలరు విలువ క్షీణించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/