జిగేల్‌మన్న సూచీలు

stock exchange
stock exchange

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక సమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచిలను ముందుకు నడిపించాయి. ఈ వారాన్ని మార్కెట్లు జోరుగా ప్రారంభించాయి. అటు చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం లాంటివి మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపర్చాయి. దీంతో ఆరంభం నుంచే దూకుడు మీదున్న సూచీలు కొత్త శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ 553 పాయింట్లు ఎగబాకి 40,268 వద్ద సరికొత్త రికార్డుతో ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజి నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 12,088 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.29గా కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/