వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూత

Banks
Banks

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో వరుసగా నాలుగు రోజుల పాటు జాతీయ బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు బ్యాంకులు పనిచేయవని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. 26, 27 తేదీలలో దాదాపు నాలుగు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా సమ్మె చేయనున్నారు. నాలుగవ శనివారం అయినందున 28వ తేదీ బ్యాంకులకు సెలవు. అదే విధంగా మరుసటి రోజు 29వ తేదీని ఆదివారం నాడు కూడా బ్యాంకులు పనిచేయవు. తిరిగి సోమవారం సెప్టెంబర్ 30వ తేదీనే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నాలుగు రోజుల పాటు చెక్ క్లియరెన్సులు, ఎటిఎం సర్వీసులకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/