స్పైస్‌జెట్‌కు భారీ లాభాలు

spicejet flight
spicejet flight

బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920) తొలి త్రైమాసిక ఫలితాల్లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. సంస్థకు ప్రయాణికుల సంఖ్య పెరగడం, జెట్ ఎయిర్‌వేస్ మూసివేతతో చార్జీలు పెంచడం వంటి కారణాల వల్ల ఈసారి కంపెనీ లాభాలు పెరిగాయి. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నికర లాభం రూ.261 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.38 కోట్ల నికర నష్టం వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం రూ.2,253 కోట్ల నుంచి రూ.3,145 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ రెవెన్యూ రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/