5జి ట్రయల్స్‌కు సర్వం సిద్ధం!

telecom
telecom

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో 5జి ట్రయల్స్‌కోసం అన్ని కంపెనీలను టెలికాం శాఖ అనుమతించింది. అమెరికా నిషేధించిన చైనా సంస్థ హువేయితోసహా అన్ని కంపెనీలను 5జి ట్రయల్స్‌కోసం అనుమతించింది. ఇందుకు నియమించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేయాల్సి ఉంది. ప్రభుత్వం ట్రయల్స్‌కు సంబంధించి ఒక ప్రత్యే కమిటీని నియమించింది. ఈ కమిటీకి ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ సలహాదారు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ ప్రత్యేకించి చైనా కంపెనీ హువేయి భాగస్వామ్యంపై కూడా సంప్రదింపులు జరిపింది. అన్ని కంపెనీలు 5జి ట్రయల్స్‌లో పాల్గొనవచ్చని ఇప్పటికప్పుడు నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఏమీలేవని చెపుతున్నారు.

కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు కమిటీ తన నివేదికను అందచేస్తుంది. డిజిటల్‌కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ టెలికాం శాఖలో అత్యున్నతస్థాయి విభాగం ఇటీవలే 5జి ట్రయల్స్‌కు గ్రీన్‌షిగ్నల్‌ ఇచ్చింది. ఎరిక్‌సన్‌; శాంసంగ్‌, హువేయి, జడ్‌టిఇ వంటివి తమతమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాయి. 5జి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, ట్రయల్స్‌కు సంబంధించి డాట్‌ సిఫారసుచేసిన సూత్రాల ఆధారంగా ఐఐటి కాన్పూర్‌డైరెక్టర్‌ అభ§్‌ు కరాండికర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ అధ్యయనంచేసింది. 5జి ట్రయల్స్‌కోసం ఎంతమొత్తం స్పెక్ట్రమ్‌ కేటాయించాలి?

ధరలు, ఇతర అన్ని అంశాలపై ఈ కమిటీ అధ్యయనంచేసి ప్యానెల్‌కు నివేదిక ఇచ్చింది. టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కూడా ప్రభుత్వం 5జి సేవలవేలంకు సిద్ధం అయిందని, ప్రస్తుత కేలండర్‌సంవత్సరంలోనే ప్రభుత్వం 5జి ట్రయల్స్‌ నిర్వహిస్తుందని, వచ్చే మూడునెలల్లోనే పూర్తి కావచ్చని వెల్లడించారు. రక్షణ అంశాలకు సంబంధించి కొంత సందేహాలు వ్యక్తంచేస్తోంది. ప్రత్యేకించి హువేయి కంపెనీకి అనుమతించడాన్ని కొంత వెనుకంజవేసింది. ఈ కంపెనీనుంచి నిర్దిష్టమైన హామీలు లభించిన తర్వాతనే ఇవ్వాలని తేల్చారు. అయితే హువేయి కంపెనీ కూడా 5జి ట్రయల్స్‌కు సంబంధించి తమకే రావచ్చన్న ధీమాను వ్యక్తంచేస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/