స్మార్ట్‌ నోకియా టీవీలు

nokia smart tv
nokia smart tv

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ నోకియా.. స్మార్ట్‌ టీవీలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. ఇండియా మార్కెట్లోకి స్మార్ట్‌ టీవీలను విడుదల చేసేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టుతో జట్టుకట్టింది. స్మార్ట్‌ టీవీల కోసం నోకియా బ్రాండ్‌ను వినియోగించుకునేందుకు నోకియాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఫ్లిప్‌కార్డు తెలిపింది. ఈ రెండు కంపెనీలు కూడా టీవీలకు సంబంధించిన సమాచారాన్ని గానీ, ధరలు విడుదల తేదీలను గానీ విడుదల చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా నోకియాకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయని, ఇలాంటి కంపెనీతో తాము చేతులు కలపడం ఎంతో సంతోషకరమని ఫ్లిప్‌కార్డ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ (ప్రైవేట్‌ బ్రాండ్‌) ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు.
ఇప్పటికే చాలా ఫోన్ల కంపెనీలు టీవీలను మార్కెట్‌లోకి తెచ్చారు. వీటిలో సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్‌, ఇంటెక్స్‌,షామీ, మోటోరోలా, వన్‌ఫ్లస్‌ వంటివి ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/