హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల తయారీ

resolute electronics
resolute electronics

హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్‌ ఇప్పటికే ప్యానాసోనిక్‌, లాయిడ్‌ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్‌ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌, శంషాబాద్‌ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30లక్షల ఎల్‌ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని ఎండీ రమీందర్‌ సింగ్‌ సోయిన్‌ తెలిపారు. స్కైక్వాడ్‌ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ స్కైవర్త్‌ శంషాబాద్‌ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతో పాటు వాషింగ్‌ మెషీన్లు, డిష్‌ వాషర్స్‌, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్‌ చేస్తాయని రమీందర్‌ వెల్లడించారు. ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15-20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతామని అన్నారు. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయని తెలిపారు. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/