బ్యాంకింగ్‌ రుణ పరపతిపై ఆర్థికమంత్రి సమీక్ష

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ : బడ్జెట్‌కసరత్తుల్లోభాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ అధిపతులతో సమావేశంనిర్వహించారు. బ్యాంకింగ్‌రంగం ఆర్థికవృద్ధికి దోహదంచేసేవిధంగా వినియోగరంగ డిమాండ్‌ను పెంచేందుకు వీలుగా ఈ చర్చలు ఉంటాయని చెపుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీనే సీతారామన్‌ తన బడ్జెట్‌ను పార్లమెంటుకు ప్రవేశపెడతారు. బ్యాంకులు ప్రస్తుతం అమలుచేస్తున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ఛార్జిలు పిఎంజన్‌ధన్‌యోజన ఖాతాదారులకు ఓవర్‌డ్రాప్టు సౌకర్యం వంటివికూడా చర్చకు వచ్చాయి. రూపేకార్డులసాయంతో జన్‌ధన్‌ఖాతాదారులకు ఓవర్‌డ్రాప్టుసౌకర్యం కల్పిస్తోంది. అలాగే 50 కోట్ల టర్నోవర్‌కుపైబడిన సంస్థలు తమ తమ ఖాతాదారులకు తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్‌ చెల్లింపులు విధానం అమలుచేయాల్సి ఉంటుంది. సర్ఫేసిచట్టంపరిధిలో రికవరీలకింద ప్రకటించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోవేలంకు వచ్చిన సంస్థల వివరాలు, రికవరీ విధానంపై కూడా ఆమె సమీక్షించారు. ఎన్‌సిఎల్‌టి ఇతర ట్రిబ్యునళ్ల ఆధారంగా చేసిన రికవరీలపై కూడా విస్తృతస్థాయిలోచర్చించనున్నట్లు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/