చమురు సెగతో ఈ షేర్లు విలవిల..!

petrol
petrol

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పలు సంస్థలు షేర్లు డీలాపడ్డాయి. పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలతోపాటు, ఇంధన వ్యయాలు అధికంగా గల విమానయాన షేర్లలోకూ అమ్మకాలు తలెత్తాయి. చమురు నుంచి ముడి సరకులు పొందే పెయింట్స్‌, టైర్ల పరిశ్రమ షేర్లు కూడా డీలాపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత భారీగా ఆయిల్‌ సరఫరాలు చేసే సౌదీ అరేబియాకుచెందిన అరామ్‌కో క్షేత్రాలపై శనివారం డ్రోన్‌ దాడులు జరిగాయి. దీంతో మంటలు వ్యాపించి రోజుకి 5.7మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తికి విఘాతమేర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలలో 5 శాతం వాటాను ఆక్రమించే ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉన్నట్టుండి చమురు ధరలకు డిమాండ్‌ పెరిగింది. అటు లండన్‌ మార్కెట్లోబ్రెంట్‌, ఇటు న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ ధరలు 10 శాతం స్థాయిలో పెరిగాయి. వెరసి బ్రెంట్‌ బ్యారల్‌ ఏకంగా 6 డాలర్లు పెరిగి 66 డాలర్లను దాటగా, నైమెక్స్‌ కూడా 5 డాలర్లు పెరిగి 60డాలర్ల వద్దకు చేరింది. ఒక్కరోజులోనే చమురు ధరలు ఇంతక్రితం ఈ స్థాయిలో అంటే 1991జనవరిలో మాత్రమే ఈ విధంగా పుంజుకున్నాయి. ముడిచమురు ధరల దెబ్బకు దేశీయంగా పలు రంగాల కంపెనీలు క్షీణించాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/