ఏడు లక్షల మందికి ఉఫాది

company employees
company employees

ముంబయి: దేశంలో ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పొయున వారిలో దాదాపు ఏడు లక్షల మందిని కొత్తతరం పరిశ్రమలు ఆదుకున్నాయి. ఆహార సరఫరా సంస్థలు, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ఆర్థిక సేవల సంస్థలు తాత్కాలిక ఉపాధిని కల్పించాయి. ఈ ఉద్యోగాలు ఆరు నుండి ఎనిమిది నెలలపాటు ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 1,40,000ల ఉద్యోగాలను ప్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సృష్టించాయి. ఈ సంస్థలు దేశంలోని చివరి ప్రదేశం వరకు డెలివరీ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చూస్తుండటంతో ఉద్యోగుల అవసరం పెరిగింది. విక్రయాల నెట్‌వర్క్‌ 30శాతం ఉద్యోగాలను పెంచింది. ఇండియన్‌ స్టాఫింగ్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం 6,50,000 ఉఫాదిని ఈ పండుగ సీజన్లలో సృష్టించినట్లు తేలింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/