భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

sensex
sensex

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మురిసిపోయింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలకు ముందు సూచీలు రాణించాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలను సైతం పట్టించుకోకుండా భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 150 పాయింట్లు ఎగబాకి మళ్లీ 11,400 మార్క్‌ను దాటింది.200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌ వెనుదిరిగి చూడలేదు. కొనుగోళ్ల మద్దతు లభించడంతో అంతకంతకూ ఎగబాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 537 పాయింట్లు లాభపడి 37,931 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 150 పాయింట్ల లాభంతో 11,407 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.16గా కొనసాగుతోంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/