భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: నిన్న అమాంతం కుప్పకూలిన దేశీయ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఉదయం నుంచి సూచీలు లాభాల్లో సాగాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్.. ఒక దశలో 460 పాయింట్లకు పైగా ఎగబాకి రోజు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయింది. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గరిష్ఠాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్లు లాభపడి 37,311 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 11,029 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.27గా కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/