ఇన్ఫోసిస్ దెబ్బకు నష్టాల్లో మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్ఓలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో… దాని షేర్లు ఈరోజు కుప్పకూలాయి. దీని ప్రభావంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 38,963కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,588కి దిగజారింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/