లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE Sensex Rises
BSE Sensex Rises

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికి… ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈనాటి ఇంట్రాడే ట్రేడింగ్ లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు… ఆ తర్వాత భారీగా పెరిగాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11వేల మార్క్‌ పైన మొదలైంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 264 పాయింట్లు ఎగబాకి 37,333 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు కోలుకుని 71.56గా కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/