భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: ఈరోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 369 పాయింట్ల లాభంతో 39,275 వద్ద, నిప్టీ 11,795 పాయింట్ల లాభంతో 105 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈరోజు మార్కెటోల్ల ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, ఐటీసీ సూచీలను పరుగులు పెట్టించాయి. నిఫ్టీ తొలిసారి 11,798 మార్కును తాకింది. ప్రైవేటు బ్యాంక్‌ల సూచీ భారీలాభాల్లో ట్రేడైంది. ఇక కొత్తగా లిస్టైన మెట్రో పోలీస్‌ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడైంది. వరల్డ్‌ ఫండ్‌ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది. ఐటీ రంగ దిగ్గజం టాటాకన్సల్టెన్సీ ఆరునెలల గరిష్ఠంలో ట్రేడైంది. కంపెనీ అంచనాల కంటే 2.4శాతం వృద్ధి సాధించడంతో మదుపరుల నమ్మకాన్ని పెంచింది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/