నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,955 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.36గా ఉంది. యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకి, వేదాంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/