నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఉదయం 9.56 గంటల సమయంలో సెన్సెక్స్‌ 24 పాయింట్లు నష్టపోయి 41,233 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 12,101 వద్ద ట్రేడవుతుంది. తొలుత నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో కోలుకొని లాభాల్లోకి ఎగబాకినప్పటికీ …తిరిగి నేలచూపులు చూశాయి. అంతర్జాతీయంగా కరోనా భయాలు, దేశీయంగా టెలికాం కంపెనీల ఏజీఆర్‌ చార్జీల చెల్లింపు వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/