తప్పుదోవ పటిస్తున్న ట్రేడ్‌ వెబ్‌సైట్లపై’ సెబీ వేటు!

share market
share market

న్యూఢిల్లీ : ఈక్విటీ మార్కెట్లలో భారీ రాబడులు సాధించుకోవచ్చని, షేర్‌మార్కెట్‌ సూచనలు అందిస్తామని, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్న ఆన్‌లైన్‌ పోర్టళ్లపై మార్కెట్ల పర్యవేక్షణ సంస్థ సెబీ చర్యలు చేపట్టింది. వాటాదారులుగా చేరి భారీ రిటర్నులు సాధించవచ్చన్న తప్పుడు సమాచారాన్ని విశేషంగా వ్యాప్తిచేస్తున్న వెబ్‌సైట్లను నిషేధించింది. కొందరు వ్యక్తులు ఇలాంటి రిజిస్టరు కాని ఇన్వెస్ట్‌మెంట్‌ సలహా వెబ్‌సైట్లను క్రమానుగతంగా ఏర్పాటుచేసి ఇన్వెస్టర్లను ప్రలోభపెడుతున్నాయని అంతేకాకుండా నెలవారీ భారీ రిటర్నులు సాధించవచ్చన్న ఆశలు పెంచుతున్నాయని సెబీ గుర్తించింది.ఈ వెబ్‌సైట్లు అంతేకాకుండా ఇన్వెస్టర్లను పెట్టుబడులుపెడితే 90 నుంచి 99శాతం రిటర్నులు సాధించవచ్చని అంచనావేసాయి. నెలవారీగా కనీసం 800 నుంచి 900శాతం లాభాలు పొందవచ్చని వెల్లడించింది. సెబీ పూర్తికాలపు సభ్యుడుమాధాబి పూరి బచ్‌ ఈ వ్యవారాలపై నిషేధం విధిసైఊ్త ఉత్తర్వులు జారీచేసారు. వాటిని తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసారు. అంతేకాకుండా వాటి యాజమాన్యాలను పూర్తిగా ఈ వెబ్‌సైట్లను నిలిపివేయాలని ఆదేశించారు. సెబీ ఇన్వెస్‌మటమెంట్‌ సలహాదారులుక్రమబదీకదకరణ చట్టం 2013 ప్రకారం ఇలాంటివాటిని అనుమతించేదిలేదని, ఒకవేళ ఇలాంటి వెబ్‌సైట్లు పనిచేస్తున్నా అవి చట్టవ్యతిరేకంగానే పరిగణిస్తామని సెబీ వెల్లడించింది. వీటిలోముఖ్యంగా ట్రేడ్‌4టార్గెట్‌డాట్‌కామ్‌, నిఫ్టీష్యూర్‌షాట్‌డాట్‌కామ్‌, ఎంసిఎక్స్‌భవిష్యడాట్‌కామ్‌, కాల్‌పుట్‌ డాట్‌ ఇన్‌, న్యూస్‌బేస్డ్‌ టిప్స్‌ డాట్‌కామ్‌, ఫ్యూచర్‌వాండ్‌ఆఫ్షన్‌ డాట్‌కమా; ఆప్షన్‌టిప్స్‌ డాట్‌ ఇన్‌, కమోడిటీ టిప్స్‌ డాట్‌ఇన్‌, షేర్‌టిప్స్‌లైవ్‌ డాట్‌కామ్‌, దిప్రీమియం స్టాక్స్‌ డాట్‌కామ్‌, డాల్‌పుట్‌ఆప్షన్‌ డాట్‌ఇన్‌, ట్రేడింగటిప్స్‌కంప్లయింట్‌స్డఆట్‌కామ్‌ వంటి సంస్థలను సెబీ నిషేధించింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: