ఎస్‌బిఐ బ్యాడ్ లోన్‌లు రూ.12,000 కోట్లు, తగ్గించి చూపిన బ్యాంకు

State Bank of India
State Bank of India

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను చూపించింది. కానీ చూపించిన లాభాల కంటే ఎనిమిది రెట్ల లాభాలు ఉన్నట్లుగా తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,932 కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్‌పిఎ) ఎస్‌బిఐ తక్కువగా చూపించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదిక తెలిపింది. ఎస్బీఐ ప్రకారం స్థూల నిరర్థక ఆస్తులు రూ.1.72 లక్షల కోట్లు. కానీ ఆర్బీఐ ప్రకారం ఈ నిరర్థక ఆస్తులు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే నికర నికర ఎన్పీఏలు ఎస్బీఐ ప్రకారం రూ.65,895 కాగా, ఆర్బీఐ అంచనా ప్రకారం రూ.77,827 కోట్లుగా ఉంది. దీంతో ఆర్బీఐ, ఎస్బీఐ లెక్కలకు మధ్య రూ.11,932 కోట్ల తేడా ఉంది. ఫలితంగా నిబంధనల ప్రకారం బ్యాలెన్స్ షీట్లో ఎన్పీఏలకు అదనంగా రూ.12,036 కోట్లను ఎస్బీఐ కేటాయించింది. దీంతో రూ.6,968 కోట్ల నష్టం వచ్చింది. RBI అంచనాలతో పోలిస్తే తమ ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల్లో వ్యత్యాసం ఉండటం వల్లే ఇలా జరిగిందని ఎస్బీఐ చెబుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/