ఎస్‌బిఐ .. రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపు

State Bank of India
State Bank of India

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల్లో రుణాలపై వడ్డీరేట్లను 15 బేసిన్‌ పాయింట్లు తగ్గించింది. కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు(ఎంసిఎల్‌ఆర్‌)లో కోత విధించింది. ఏడాది రుణాలపై 7.85 శాతం నుంచి 7.75 శాతం వరకు, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణాలపై 7.45 శాతానికి తగ్గించింది. మూడు నెలల కాలపరిమితి గల రుణ రేటును 7.65 శాతం నుంచి 7.5 శాతానికి కుదించింది. 3 ఏళ్ల కాల పరిమితి గల రుణాలపై 8.05 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా పదోసారి. మరోవైపు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిన్‌ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/