తగ్గిన ఎస్‌బిఐ వడ్డీరేటు

SBI
SBI

న్యూఢిల్లి: స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ వ్యయాల ఆధారంగా నిర్ణయించే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటు వర్తించే అన్ని కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 8.05 శాతం నంచి 8 శాతానికి తగ్గించింది. ఈ నెల 10నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సవంత్సరం ఎస్‌బిఐ తన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేటు తగ్గించడం ఇది ఏడోసారి. అక్టోబరులోనూ ఎస్‌బిఐ ఎంసీఆర్‌ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు 100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ నెల 10 నుంచి టర్మ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటునూ 15 నుంచి 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్టు తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/