జనవరి 1 నుంచి ఎస్‌బిఐ కొత్త నిర్ణయాలు

State Bank of India
State Bank of India

న్యూఢిల్లీ:  ఎస్‌బిఐ నుంచి ఈ ఏడాది మూడు కీలక మార్పులను కస్టమర్లు గుర్తించాలి. స్టేట్ బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు ఇప్పుడు 8.05 శాతం నుంచి 7.8 శాతానికి దిగి వచ్చింది. ఈ నిర్ణయం జనవరి 1, 2020 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీ తర్వాత ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు తగ్గించిన ఒకే బ్యాంకు ఎస్‌బిఐ. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. అలాగే ఓటిపి ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్ దీంతో మరింత సురక్షితం అవుతాయి. ఇవి కూడా జనవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి. అయితే రూ.10,000కు పైగా అమౌంట్ పైన ఈ సేవలు ఉంటాయి. చివరగా పాత ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్న వారు ఈవీఎం చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. పాత మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు ఈ రోజు నుంచి పని చేయవు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/