సచిన్‌ బన్సల్‌ ఆర్థిక సేవల వ్యాపారాల్లోకి..

Sachin Bansal
Sachin Bansal

ముంబయి: ప్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ ఆర్థిక సేవల వ్యాపారాల్లోకి వేగంగా విస్తరిస్తున్నారు. ప్రపంచ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌..ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా బన్సల్‌ తన వాటా విక్రయించి కంపెనీ నుంచి బయటికొచ్చారు. తద్వారా సమకూరిన రూ.6,000 కోట్ల వరకు నిధులతో పలు కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ అందులో ఒకటి. ఈ సూక్ష్మ రుణ సంస్థ తాజాగా వాణిజ్య బ్యాంక్‌ లైసన్సు కోసం ఆర్‌బీకి దరఖాస్తు చేసుకుంది. గత ఏడాది సెప్టెంబరులో తన ఇన్వేస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ నవీ టెక్సాలజీస్‌ ద్వారా చైతన్య ఇండియాను కొనుగోలు చేసిన బన్సల్‌ ఇందులో రూ.739 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. కాగా నవీ టెక్నాలజీస్‌ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూపునకు చెందిన సాధారణ బీమా సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/