రూపాయి మరింత పటిష్టం

rupee
rupee

ముంబయి: డాలరుతో రూపాయి మారకం విలువలపరంగా భారత్‌ కరెన్సీ పదిపైసలుపెరిగింది. ప్రస్తుతం 71.87 రూపాయలకు చేరింది. అమెరికా కరెన్సీని బ్యాంకులు, ఎగుమతిదారులు ఎక్కువ విక్రయిస్తుండటంతో రూపాయి మారకం విలువలు పటిష్టం అయ్యాయి. మరికొన్ని కరెన్సీలతోపోలిస్తే కొంత క్షీణత ఎదుర్కొంటున్న డాలర్‌కు అనుగుణంగానే రూపాయి పెరుగుతూ వస్తోంది. వీటికితోడు విదేశీ నిధులురాకకూడా ఎక్కువగా ఉంది. దేశీయ ఈక్విటీలు ప్రారంభంనుంచే పెరుగుతుండటం కూడా కొంత రూపాయికి మద్దతు లభించినట్లయింది. విదేశీ నిధులు రాకపెరుగుతుండటమే రూపాయికి బలంపెరిగిందన ఇచెప్పాలి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2043.06 కోట్ల విలువైన షేర్లలో పెట్టుబడులుపెట్టారు. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌పరంగా రూపాయి 71.94వద్ద ప్రారంబం అయింది. పదిపైపలు సెరిగి 71.87వద్దకు చేరింది. రెండునెలల గరిష్టానికి 71.97వద్దకు చేరింది. 34పైసలు ఒక్కసారిగాపెరిగిందని అంచనా. ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా దిగజారడం కూడా కొంత డాలర్‌ డిమాండ్‌ తగ్గి రూపాయి మారకం విలువలుపెఇరగాయి.