రూ.10 నాణేలు మాకొద్దు..!

Rs,10 coins
Rs,10 coins


ఇంఫాల్‌: రూ.10నాణేలు చెల్లుతాయని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎన్నిసార్లు చెబు తున్నా కూడాప్రజలు మాత్రం చెల్లవనే నమ్మకం తోనే ఉన్నారు. రూ.10నాణేం తీసుకొమ్మంటే నాకొద్దు బాబో§్‌ు నోటు ఇవ్వండి అని అంటు న్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితే ఉండగా, మణిపూర్‌లో మాత్రం మరింత దారు ణంగా ఉందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు రూ.10నాణేన్ని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. రూ.10 నాణేలు చెల్లినప్పటికీ అవి చెల్లుతాయో లేదో అన్న అనుమారం మాత్రం ప్రజల్లో ఇంకా పోలేదు. సూపర్‌ మార్కెట్లు, బస్సులు, చిన్ని చిన్న షాపులు, కూరగాయల వ్యాపారులు 10 రూపాయల నాణేలను తీసుకోవట్లేదని ఓ ప్రభుత్వ ఉద్యోగి తెలిపారు. కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు కూడా తీసుకోవట్లేదని ఆయన వెల్లడించారు. అయితే చాలా మంది ఇతరుల మాటలు నమ్మే రూ.10నాణేలను తీసుకోవట్లేదు. పది రూపాయల నాణేలు చెల్లుతాయో లేదో నాకు తెలియదు గానీ, వేరేవాళ్లు చెల్లవని చెబితే నేను తీసుకోవట్లేదని ఒక కూరగాయల వ్యాపారి తెలి పారు. ఇదివరకు కూడా ఈ విధంగా అపోహలు ఎక్కువైతే, ఆర్‌బిఐ ముందుకొచ్చి ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయని పలు మార్లు స్పష్టం చేసింది. అయితే దేశీయ మార్కెట్లో 14 డిజైన్లలో రూ.10నాణేలు చలామణిలో ఉన్నాయి. అవి నకి లీ నాణేలు కాదు, ఎలాంటి అనుమానాలు లేకుం డా తీసుకోవచ్చని మరోసారి ఆర్‌బిఐ స్పష్టంచేసింది.