జియో రూ.600కే మూడు రకాల సేవలు

గిగా ఫైబర్ నెట్ ను ప్రారంభించనున్న జియో
వచ్చే నెల 12న ప్రారంభం

Reliance Jio
Reliance Jio

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఇప్పటికే సంచలనానికి తెర తీసిన జియో… తాజాగా మరో చరిత్ర సృష్టించబోతోంది. కేవలం రూ. 600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 12వ తేదీన జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించబోతోంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్ తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. ఓఎస్టీ డివైస్ కోసం రూ. 4500 చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తన్ని వెనక్కి ఇచ్చేస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/