ఐదు సంస్థలపై రూ.27 లక్షల జరిమానా!

న్యూఢిల్లీ : స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రుజువుకావడంతో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఐదు సంస్థలపై రూ.27 లక్షల జరిమానా విధించింది. స్టాక్‌ ఆప్షన్స్‌లో అవకతవకలకు పాల్పడినట్లు సెబీ ధృవీకరించింది. జహంగిరాబాద్‌ ఫైనాన్స్‌ కంపెనీ, రెనెసోలా ఇండియా, రాకేష్‌ గార్గ్‌, రత్తన్‌ ఇస్పట్‌, రిట్‌మాన్‌ కమోడిటీస్‌ సంస్థలు సెబీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఈ సంస్థలపై 2014 ఏప్రిల్‌నుంచి 2015 సెప్టెంబరువరకూ నిర్వహించిన కార్యకలాపాలపై సెబీ విచారణజరిపింది. కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను కొనఇన సెకన్లలోనే పరస్పరం మార్పిడిచేస్తూ నిర్వహించాయని, అంతేకాకుండా స్వల్పకాలవ్యవధిలోనే ట్రేడింగ్‌ రివర్స్‌చేసాయని, ధరల్లోను, వాణిజ్యంలోనూ భారీ వ్యత్యాసాలు కనిపించినట్లు సెబీ వెల్లడించింది. కృత్రిమంగా మార్కెట్‌ సృష్టించిందని సెబీ విచారణజరిపింది. ఈ సంస్థలు ఇలాంటి ట్రేడింగ్‌ నిర్వహించడం అక్రమమని సెబీ వెల్లడించింది. అక్రమ, సహేతుకంగాలేని వాణిజ్య విధానాల నిషేధం నిబందనలప్రకారం వీటిపై జరిమానా విదించినట్లు వెల్లడించింది. ఒక్కొక్క సంస్థపైనా ఐదు లక్షలు చొప్పున విధించిన జరిమానా రత్తన్‌ ఇస్పాట్‌, రిట్‌మాన్‌ కమోడిటీస్‌, జహంగిరాబాద్‌ఫైనాన్స్‌లకు విధిస్తే ఆరు లక్షలు, రూ.6.5 లక్షలు మాత్రం రాకేష్‌ గార్గ్‌, రెనెసోలా ఇండియాలపై జరిమానా విదించింది. 2018 ఏప్రిల్‌లో సెబీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొత్తం 14,720 సంస్థలపై అక్రమ కార్యకలాపాలునిర్వహించి స్టాక్‌ విభాగంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. మొత్తం ఇలాంటి సంస్థలపై గత ఏడాది అక్టోబరునుంచి 50కిపైగా ఉత్తర్వులు జారీచేసింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
: