సూపర్‌రిచ్‌ మహిళ రోష్నినాడార్‌!

RoshniNadarMalhotra
RoshniNadarMalhotra


ముంబై: ముఖేష్‌ అంబానీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లోనూ ఒకరు. మగవారిలో ఈయన మించిన సంపన్నుడు దేశంలోనే లేడు. మరి మహిళల విషయానికి వస్తే, దేశంలో ఎవరు అత్యంత సంపన్నురాలో తెలుసా? భారత్‌లో అత్యంత మహిళా ధనవంతురాలుగా రోష్ని నాడార్‌ కొనసాగుతున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురుణ్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2019లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రోష్ని నాడార్‌ హెచ్‌సిఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సిఇఒగా ఉన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్‌ టెక్‌కు ఇది మాతృసంస్థ. ఈమె సంపద విలువ ఏకంగా రూ.36,800కోట్లుగా ఉంది. దేశీయ బిలియనీర్‌, హెచ్‌సిఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫౌండర్‌ శివ నాడార్‌ కుమార్తె ఈమె. నాడార్‌ తర్వాతి స్థానంలో గోద్రెజ్‌ కంపెనీకి చెందిన స్మిత వి కృష్ణ ఉన్నారు. ఈమె సంపద విలువ రూ.31,400కోట్లు. ఇక వీరి తర్వాత స్థానంలో కిరణ్‌ నాడార్‌ మూడోస్థానంలో ఉన్నారు. శివ నాడార్‌ భార్య ఈమె. ఈమె సంపద విలువ రూ.25,100కోట్లుగా ఉంది.

శివ నాడార్‌ ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో ఫార్మా కంపెనీ బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా నిలిచారు. ఈమె సంపద విలువ రూ.18,500కోట్లుగా మజుందార్‌ షాకు పద్మశ్రీ, పద్మ భూషణ్‌ వంటి పురస్కారాలు లభించాయి. సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో మంజు దేశ్‌బంధు గుప్తా ఉన్నారు. ఈమె సంపద విలువ రూ.18వేలకోట్లుగా ఉంది. 2017 వరకు ఈమె లూపిన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే ఆ కంపెనీలో నాలుగు దశాబ్దాలకు పైగా బోర్డు మెంబర్‌గా ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/