బంగ్లా దిగుమతులతో భారత్‌ గార్మెంట్‌ పరిశ్రమకు నష్టం!

Garments
Garments

ముంబయి: రెడీమేడ్‌ దుస్తులు తయారీ కంపెనీలు ఇపుడు విదేశాలనుంచి అత్యధికసంఖ్యలో వస్తున్న దిగుమతులతో ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇపుడు మరీ ప్రత్యేకించి చూస్తే పొరుగుననే ఉన్న బంగ్లాదేశ్‌నుంచి రెడీమేడ్‌దుస్తుల దిగుమతులు భారీ ఎత్తున పెరిగిపోయాయి. ఎలాంటిసుంకాలులేని గార్మెంట్‌ దిగుమతులు స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందం కింద భారత మార్కెట్‌లో చొరబడుతున్నాయి. దీనితో బ్యాంకులు కూడా ఎంఎస్‌ఎంఇ రంగంలో ఉన్న గార్మెంట్స్‌ తయారీ యూనిట్లకు 80శాతం రుణపరపతిని తగ్గించేసాయి. బంగ్లాదేశ్‌నుంచి ఈ ఏడాది దిగుమతులు 82శాతంపెరిగాయి. 365 మిలియన్‌డాలర్లవిలువైన దిగుమతులుపరిగాయి. 2024-25 నాటికి 52శాతం పెరిగి 3.6 బిలియన్‌డాలర్లుగా ఉంటుందని అంచనా.

దీనివల్ల భారత్‌లోని ఎంఎస్‌ఎంఇరంగంలోఉన్న పదిలక్షలమంది ఉపాధికి గండికొడుతున్నట్లవుతుందని తయారీదారులు చెపుతున్నారు. బంగ్లాదేశ్‌పరంగా స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందం కింద భారత్‌, చైనాలతో పలు సుంకాలులేని ఉత్పత్తులను ఎగుమతిచేసే అవకాశం ఉంటుంది. చైనానుంచి సుంకాలులేని దవస్త్రాలను కొనుగోలుచేసుకుని వాటిని తిరిగి భారత్‌కు విక్రయిస్తోంది దీనివల్లచైనా భారత్‌లోనికి వెనుకద్వారంనుంచి ప్రవేశించినట్లవుతుంది. అదే భారత్‌నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యే దస్తులకు 125శాతం సుంకం ఉంటుందని దుస్తుల ఉత్పత్తిదారులసంఘం అధ్యఓఉడు రాహుల్‌మెహతా పేర్కొన్నారు. ప్రభుత్వం బంగ్లాదేశ్‌లనుంచి వచ్చే పాబ్రిక్‌ ఉత్పత్తులనుకట్టడిచేయకపోతే దేశీయ ఉత్పత్తిసంస్థలకు ఎంతో నష్టంకఅఉగుతుందని ఆయన అన్నారు.

బిజినెస్‌ లావాదేవీలు సంఘంపరంగా సుమారు 800 కోట్లువరకూ ఉంటుందని, సుమారు వెయ్యికిపైగా బ్రాండ్లు 899 స్టోర్లు, 45వేల మంది రిటైలర్లతో ఈనెలలోనే అతిపెద్ద గార్మెంట్‌షో ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఎగుమతుల ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు ప్రేమాల్‌ ఉదాని మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ గార్మెంట్‌ ఎగుమతులు 2005లో 3 బిలియన్‌డాలర్లకు ఉన్నాయని, భారత్‌నుంచి ఐదు బిలియన్‌ డాలర్లవరకూ ఉండేవని, అవే ఇపుడు బంగ్లాదేశ్‌నుంచి 36 బిలియన్‌డాలర్లకు పెరిగాయని, భారత్‌ ఎగుమతులు ఇప్పటికీ 16.5 బిలియన్‌డాలర్లవద్దనే నిలిచాయన్నారు. వియత్నాం కూడా టాప్‌ ఐదు ఎగుమతిసంస్థల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఇపుడు స్థానికంగా 30శాతం కొనుగోలుచేయాలనన నిబంధననుసడలిస్తే భారత గార్మెంట్‌పరిశ్రమకు మరింతగా నష్టాలు వస్తాయని చెపుతున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదేశంగా బంగ్లాదేశ్‌ నిలిచింది. గత ఏడాది 40.5 బిలియన్‌డాలర్ల విలువైన రెడీమేడ్‌దస్తులు ఎగుమతిచేసింది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/