జోరందుకున్న రిలయన్స్‌ షేర్లు

Mukesh Ambani
Mukesh Ambani

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ జియో గిగా ఫైబర్‌తో పాటు కీలక నిర్ణయాలను ప్రకటించిన సందర్భంగా కంపెనీ షేర్ల విలువ నేడు జోరందుకుంది. దేశీయ మార్కెట్లు పతనమైతున్నప్పటికీ ఆర్‌ఐఎల్‌ షేర్లు మాత్రం ఊపు మీదున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలో ఆరు శాతం ఎగబాకిన షేర్లు ప్రస్తుతం 12 శాతం లాభంతో సెన్సెక్స్‌లో రూ.1,302.50 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీలో సైతం 12.10శాతం లాభపడి రూ.1,302.80 వద్ద కొనసాగుతోంది. గత పదేళ్లలో ఇంట్రాడేలో ఆర్‌ఐఎల్‌ షేర్లు ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే తొలిసారి. గతంలో మే 18, 2009న 24శాతం మేరకు ఇవి లాభపడ్డాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/