విదేశీ రుణంకోసం రిలయన్స్‌!

RELIANCE-
RELIANCE

విదేశీ రుణంకోసం రిలయన్స్‌!

ముంబయి: భారత్‌లో విదేశీ రుణాలు ఎక్కువ తీసుకుం టున్న కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటి. విదేశీ డెట్‌ రంగంనుంచి 2.7 బిలియన్‌ డాలర్లు రుణం తీసుకుంటున్న రిలయన్స్‌ ఈ మొత్తాన్ని తమకు ప్రస్తుతం ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు వినియోగిస్తోంది. రిలయన్స్‌ ఇప్పటికే 22వేల కోట్లు మూల ధనవ్యయం చేసింది. రిలయన్స్‌జియో ఇన్ఫోకా మ్‌పైనే ఎక్కువ పెట్టుబడులుపెట్టింది. జూన్‌త్రై మాసికంలో నికర ఆదాయం 9459 కోట్లుగా ప్రనకటించిన కంపెనీ తొలిత్రైమాసికంలో రిలయన్స్‌కు 2,42,116 కోట్లు రుణం ఉంది. అంతకుముందు మూడునెలల కాలంలతో 2,18,763 కోట్లనుంచి కొంతమొత్తంపెరిగింది.

ఇక చేతిలో ఉన్న నగదు నిల్వలు స్వల్పం గా పెరిగి రూ.79,492 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు 2.7 బిలతియన్‌ డాలర్లు విదేశీ డెట్‌ రుణాలను సాధించాలనినిర్ణయించింది. బహుళ విడతలుగా ఈ రుణాలను తీసుకోవాలనినిర్ణయించింది. ప్రస్తుతం విదేశీ కరెన్సీ రుణం పెరగడంతో కొంతమేర తగ్గించేందుకు కృషిచేస్తున్నట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్‌ 34 బిలియన్‌డ ఆలర్ల రునం 2022 నాటికి చెల్లించాల్సి ఉంటుంది.

13 బిలియన్‌ డాలర్లు 2018నుంచి 2020 నాటికి విధిగా చెల్లించాలి. ఎక్కువ బకాయి మొత్తం విదేశీ కరెన్సీలరూ పంలోనే ఉంది. అలాగే ఈనెల్లోనే జరిగిన సర్వసభ్యసమావేశంలో రిలయన్స్‌ ఎన్‌సిడిల జారీకి అనుమతిని సాధించింది. ట్రిబుల్‌బిప్లస్‌, ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ఇచ్చింది. సావరిన్‌రేటింగ్‌కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా. రిలయన్స్‌ ఎక్కువగా కారుచౌకగా వచ్చే ఫండ్స్‌ నుంచి నిధులు సమీకరిస్తుంది. బిఎఎ2 రేటింగ్‌ వచ్చింది. ఈరేటింగ్‌ ప్రభుత్వం ప్రభుత్వాలకు ఇచ్చే రేటింగ్‌ కంటే ఎక్కువగా ఉంది. రిలయన్స్‌ ఒక్కటే ప్రైవేటురంగంలో బాండ్లజారీచేసి విదేశీ ఇన్వెస్టర్లనుంచి నిధులు సమీకరిస్తుంది. దేశీయం గా ఉన్న ఏకైక సంస్థగా నిలిచింది.

ప్రభుత్వ రంగంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక్కటే ఈవిధానం అనుసరిస్తున్నది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల అంచనాలను చూస్తే రిలయన్స్‌ రుణం తిరిగిచెల్లింపులు 2018 నుంచి 2020 వరకూ చేయాల్సి ఉంది. 8.14 బిలియన్‌ డాలర్ల స్వల్పకాలిక రుణాలు, 3.52 బిలియన్‌ డాలర్ల బాండ్లు, 300 మిలియన్‌ డాలర్లు రివాల్వింగ్‌ రుణాలు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా వడ్డీచెల్లింపులు 1.65 బిలియన్‌ డాలర్లుసైతం చెల్లించాల్సి ఉంది. జూన్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ ఆర్ధికపరంగా ఖర్చులు మూడురెటు ్లపెరిగి రూ.3555కోట్లకు పెరిగాయి. వార్షికపద్ద తిలో భారీ వృద్ధిఅని అంచనా. గడచిన ఐదేళ్లుగా రుణాలు కూడా మూడురెట్టుపెరిగాయి. 37 బిలియన్‌ డాలర్లు రిలయన్స్‌జియోలోనే పెట్టింది. ఇతరత్రా పెట్రోకెమికల్‌బిజినెస్‌ పెట్‌కోక్‌ గ్యాసిఫికే షన్‌ యూనిట్‌కోసం పెట్టుబడులుపెంచుతున్నది.

ఇటీవలి సర్వసభ్యసమావేశంలోనే అంబాని మాట్లాడుతూ వచ్చే దశాబ్దంలో కన్సూమర్‌ అంటే వినియోగరంగ కంపెనీగా మారుతుందని వెల్లడించారు. 31శాతం రిలయన్‌సరాబడులు అన్నీ రిటైల్‌ టెలికాం రంగంనుంచే వస్తున్నాయని వెల్లడించారు. రిలయన్స్‌జియో రెండేళ్లక్రితం ప్రారంభించి 612కోట్లు నికరలాభానికి తెచ్చారు. మార్కెట్‌ లీడర్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ నికరలాభాలు 367.3 కోట్లనుంచి ఒక్కసారిగా 97.3 కోట్లకు పడిపోయాయి. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికారుఎ్డస్థాయిలో నికర ఆదాయ వనరులు రిటైల్‌బిజినెస్‌నుంచే ఎక్కువ వచ్చాయి.

లాభదాయకత జియోపరంగాపెరిగింది. పెట్రోకెమికల్‌ బిజినెస్‌ రాబడులు రెట్టింపు అయ్యాయి. అయితే రిఫైనింగ్‌ బిజినెస్‌లో మాత్రం తక్కువ మార్జిన్లు ఉన్నాయి. నికరలాభం 9459 కోట్లు గత ఏడాది ఇదేకాలంలో వచ్చిన 8021కోట్లతో చూస్తే 17.9శాతంగా పెరిగింది. ఆయిల్‌నుంచి టెలికాం రంగానికి విస్తరించిన రిలయన్స గల్ఫ్‌ఆఫ్రికా పెట్రోలియం కార్ప్‌ విక్రయంద్వారా 1087 కోట్లు సైతం మినహాయించగాఈ లాభం వచ్చింది.