టెలికాం రంగంలో రెండో స్థానంలోకి జియో

Reliance Jio
Reliance Jio

ముంబయి: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఒక సంచలనం. డేటా, కాల్స్‌ విషయంలో వినూత్నమైన ఆఫర్లను ప్రకటించిన జియో ఈ రంగంలో అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. తాజాగా వినియోగదారుల సంఖ్యాపరంగా భారతీ ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) విడుదల చేసిన మే నెల నివేదికలో తేలింది. ట్రాయ్‌ నివేదిక ప్రకారం 387.55 మిలియన్ల వినియోగదారులతో వొడాఫోన్‌ఐడియా ప్రథమ స్థానంలో నిలవగా, రిలయన్స్‌ జియో (323 మిలియన్లు), ఎయిర్‌టెల్‌ (320.38 మిలియన్లు)వినియోగదారులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/