మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర

Petrol prices
Petrol prices

హైదరాబాద్‌: దేశీ ఇంధన ధరలు వరుసగా మూడో రోజూ కూడా తగ్గాయి. శనివారం పెట్రోల్ 8 పైసలు, డీజిల్ ధర 5 పైసలు చొప్పున దిగొచ్చింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.30కు, డీజిల్ ధర రూ.70.96కు తగ్గింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.76.04కు దిగొచ్చింది. డీజిల్‌ ధర కూడా 5 పైసలు క్షీణతతో రూ.70.37కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.75.67కు తగ్గింది. డీజిల్ ధర 4 పైసలు తగ్గుదలతో రూ.70.03కు క్షీణించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.71.77కు దిగొచ్చింది. డీజిల్ ధర కూడా 5 పైసలు తగ్గుదలతో రూ.65.09కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.77.46కు దిగొచ్చింది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.68.26కు క్షీణించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.97 శాతం పెరుగుదలతో 61.54 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.39 శాతం పెరుగుదలతో 56.52 డాలర్లకు చేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/