సుంకాల తగ్గింపుకోసం ‘బులియన్‌ డిమాండ్‌

jewellery
jewellery


న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్‌ ప్రస్తుతంమాంద్యం ప్రభావానికి లోనయింది. దీనితో డిమాండ్‌ తగ్గి ధరలు లేకపోవడంతో అనేక సంస్థలు, నిర్మాణక్రమంలోని సంస్థలు వంటివి మూసివేసేప్రమాదం లేకపోలేదని బులియన్‌నిపుణులు పేర్కొంటున్నారు. అఖిలభారత వజ్రాభరణాల దేశీయ మండలి అంచనాలప్రకారంచూస్తే వారు బంగారం ఆభరణాలపై కస్టమ్స్‌సుంకం తగ్గించాలని డిమాండ్‌చేస్తున్నారు. 2019-20 కేంద్రబడ్జెట్‌లో దిగుమతిచేసుకునే బంగారంపై పదిశాతంనుంచి 12.5శాతానికి సుంకాలను పెంచారు. ఇక ఆభరణాలపై జిఎస్‌టిని మూడుశాతానికి పరిమితంచేసారు. అంతకుముందు వాట్‌ హయాంలో కేవలం ఒకటిశాం మాత్రమే ఉన్న పన్నులు జిఎస్‌టి పుణ్యమా అని మూడుశాతానికిపెరిగాయి. మొత్తంగాచూస్తే బంగారం కొనుగోళ్లపై స్థానికపన్నులు అదనం అన్నట్లుగా మొత్తం 15.5శాతం పన్నులు చెల్లించుకోవాల్సి వస్తోంది. దీనితో ఒక్కసారిగా తక్కువ డిమాండ్‌ ఏర్పడి కొనుగోళ్లు మందగించాయి. వేలాదిమంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మండలి వైస్‌ఛైర్మన్‌ షాంకర్‌సేన్‌ వెల్లడించారు. కస్టమ్స్‌ సుంకం పెంపు జిఎస్‌టి కలుపుకుంటే ఎక్కువగా భారం పడుతోంది. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై ఇఎంఐ విధానాలను అమలుచేయాలని కోరుతున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/