రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ మెరుగైన ఫీచర్లతో జనవరి 15న అందుబాటులోకి

realme-5i smartphone
realme-5i smartphone

ముంబయి: మొబైల్‌ తయారీదారు రియల్‌మి నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5ఐని నేడు విడుదల చేసింది. నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్‌ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్‌మి 5ఐ ఫీచర్లు 6.5 అంగుళాల పుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 720×1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 9.0పై, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 12+8+2+2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, 8మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రియల్‌మి కలిగిఉంది.లఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ద్వారా జనవరి 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు మొదలవుతాయి. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ సోరేజ్‌వేరియింట్‌ ధరను రూ.8999గా నిర్ణయించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/