త్వరలో రానున్న రియల్‌ మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

Realme 3 Pro
Realme 3 Pro

ఒప్పోకు చెందిన రియల్‌ మి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌ మి 3 ప్రొ ను ఈనెల 22న విడుదల చేయనుంది. ఢిల్లీ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించ‌నున్న ఓ ఈవెంట్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. అలాగే ముందు భాగంలో 25 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను కూడా ఏర్పాటు చేశార‌ని స‌మాచారం. ఇక ఈ ఫోన్‌లో ప‌వ‌ర్‌పుల్ ప్రాసెస‌ర్‌, ర్యామ్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలుస్తాయి.


మరిన్ని తాజా బిజెనెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/