ఎన్‌బిఎఫ్‌సిల్లో చీఫ్‌ రిస్క్‌ అధికారి పోస్టు తప్పనిసరి

రిజర్వుబ్యాంకు తాజా అదేశాలు

RBI
RBI

న్యూఢిల్లీ: ఐదువేల కోట్లకుపైబడిన ఆస్తులున్న నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఇకపై రిస్క్‌ అధికారులను నియమించుకోవాలని రిజర్వుబ్యాంకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే తీవ్ర ఆర్ధికసంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గత ఏడాదినుంచి ప్రభుత్వ అధీనంలోనికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం భారత ఆర్ధికరంగాన్ని తీవ్రస్థాయిలోప్రభావితంచేసిన సంగతి తెలిసిందే. ఈ విధానానిన కట్టడిచేసేందుకు ఎన్‌బిఎఫ్‌సిలు తమంత తాముగానే క్రమబద్దీకరించుకునేందుకువీలుగా ఐదువేలకోట్ల టర్నోవర్‌ లేదా సంపద కలిగిన ఎన్‌బిఎఫ్‌సిలు విధిగా ఒక చీఫ్‌ రిస్క్‌ అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ అధికారి స్వతంత్రప్రతిపత్తితో పనిచేస్తారు. అంతేకాకుండా ఎన్‌బిఎఫ్‌సి సూచించిన బాధ్యతలు, విధులతో కంపెనీ పటిష్టతకు పనిచేయాల్సి ఉంటుంది. నేరుగా రుణపరపతి విధానంలో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ప్రాధాన్యత పెరిగింది. అయితే అదేకాలంలో రిస్క్‌మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను సైతం ప్రక్షాళన చేసుకోవాలిస ఉంటుందని ఆర్‌బిఐ వెల్లడించింది. ఈ చీఫ్‌ రిస్క్‌ అధికారిని ఒక నిర్దిష్ట కాలపరిమితికి లోబడి ఎన్‌బిఎఫ్‌సిలు నియమించుకుంటాయని, బోర్డు అనుమతి ఆమోదం లేకుండా సిఆర్‌ఒను తొలగించేందుకు వీలులేదని వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/