సెకండరీ మార్కెట్ల కోసం ప్రత్యేక సంస్థ!

ఆర్‌బిఐ టాస్క్‌ఫోర్స్‌ ప్యానెల్‌ సిఫారసులు

RBI
RBI


ముంబయి: ఆర్ధికరంగం, కార్పొరేట్‌ రంగాల్లో సెకండరీ మార్కెట్ల కోసం ఒక స్వీయ పర్యవేక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ ప్యానెల్‌ సిఫారసులు చేసింది. సలహాలుసూచనీలు స్వీకరించిన తర్వాత మూడునెలల్లోపు ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చేసిన సిఫారసుల్లో అన్ని రుణాలను ప్రస్తుత ఎంసిఎల్‌ఆర్‌ వడ్డీరేటు ఇతర బ్యాంకులపరంగా బేరీజువేస్తే ఎంతమాత్రం సరిపోదని, బహిరంగ బెంచ్‌మార్క్‌రేటుకు లింక్‌చేయాల్సి ఉంటుందని, వ్యయాధారిత వడ్డీరేట్లతోనే ఈ రుణాలను అందిస్తే కార్పొరేట్‌ రంగానికి మరింతమేలు జరుగుతుందని వెల్లడించారు. ఆర్‌బిఐ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ప్యానెల్‌ తన సిఫారసులను బ్యాంకుకు అందచేసింది. కెనరాబ్యాంకు ఛైర్మన్‌ టిఎన్‌ మనోహరన్‌ ఆధ్వర్యంలోని కమిటీ స్వీయపర్యవేక్షణాసంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దీనివల్ల సెకండరీ మార్కెట్‌కు కొంతమేలు జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంకుల సమిష్టిసంఘం ఆధ్వర్యంలోను, ప్రభుత్వ ఆర్ధికసంస్థలు, ఇతర అనుబంధ సంస్థలు అన్నీ కలిపి ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలచట్టం 2013లోని సెక్షన్‌ 8ప్రకారం ఏర్పడాల్సి ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌ప్యానెల్‌ చేసిన సిఫారసులు అందిన మూడునెలల్లోపే ఏర్పాటు చేయాలిస ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. నగదు లభ్యతను పెంచడం, బ్యాంకు వృద్ధితోపాటు, ప్రామాణికాంశాలను నిర్దిష్ట నియమనిబంధనలు పాటించడం, క్రమానుగతంగా డాక్యుమెంటేషన్‌ సమీక్ష వంటివి ఈ ఎస్‌ఆర్‌బి నిర్వహిస్తుంది. సంస్థ మైలికవనరులు, సాంకేతికపరిజ్ఞానం వంటి అంశాలపరంగా కార్పొరేట్‌స్థాయిలోనే ఉంటుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఒప్పందాలుచేసుకునేందుకు వీలుగా చట్టబద్ధత ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం బ్యాంకుల అందిస్తున్న స్వల్ప వ్యయాధారిత వడ్డీరేట్లను బహిర్గత బెంచ్‌మార్క్‌రేట్లకు అనుసంధానంచేయాలని కూడా టాస్క్‌ఫోర్స్‌సూచించింది. ఎస్‌ఆర్‌బి సిఫారసుల్లో ముఖ్యం కాగా 5-10శాతం రుణ బకాయిలు మొత్తం రుణపరిమితిలో ఉన్న మొత్తం బకాయి ఉంటే వాటిని కూడా ఎఆర్‌సిలకు విక్రయించవచ్చు. మూచువల్‌ఫండ్స, బీమా కంపెనీలు, పెన్షన్‌ఫండ్స్‌ వంటి వాటికి సైతం పాల్గొనేందుకు వీలుగా చట్టాలను సవరించాల్సి ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/