రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ

Major-wilful-defaulters
Major-wilful-defaulters

ఢిల్లీ: ఉద్దేశ పూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. సమాచార హక్కు చట్టం కింద 2019 మేలో ద వైర్‌ సమర్పించిన దరఖాస్తుకు సమధానంగా 30కంపెనీల పేర్లతో ప్రధాన ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఆర్‌బీఐ విడుదల చేసిన 30 కంపెనీల్లో వజ్రాల వ్యాపారి మహుల్‌ చోక్సికి చెందిన 3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం రూ.50,000 కోట్లు దాటింది. ఈ డేటాను కేంద్రీకృత బ్యాంకింగ్‌ సమాచారమైన ‘ది సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్ఞ్‌ నుంచి తీసుకొని విడుదల చేసింది. దీనిలో రూ.5 కోట్లకు పైగా రుణం తీసుకొన్న వారి సమాచారం ఉంటుంది. మరోవైపు ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ కూడా గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సమాచారంపై పనిచేస్తోంది. ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ ప్రకారం 2018 డిసెంబరు నాటికి 11000 వేలకి పైగా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొటినట్టు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/