రేపో వడ్డీరేట్లు తగ్గాయ్‌

Reserve Bank of India
Reserve Bank of India

ముంబయి: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసికి పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఆర్‌బీఐ ఈరోజు వెల్లడించింది. ఇందులో రెపో రేటుపై పావు శాతం కోత విధించింది. ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 5.75శాతానికి చేరింది. రివర్స్‌ రెపో రేటు, బ్యాంక్‌ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇప్పుడు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. దీంతో ఈఎంఐల వాటా కూడా త‌గ్గే అకాశం ఉంది. ఇండ్లు, కార్ల కోసం రుణాలు తీసుకునేవారికి, కార్పొరేట్ సంస్థ‌ల‌కు వడ్డీభారం తగ్గనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/