వచ్చే 3నెలల్లో కొత్త కొలువులు తక్కువే

Problem of Unemployment
Problem of Unemployment

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే మూడునెలల్లో కేవలం 19శాతం యాజ మాన్యాలు మాత్రమే నియామకాలు చేపడతా యని, 52శాతం కంపెనీ ల్లో ఉద్యోగులకు వేత నాల్లో ఎలాంటి మార్పు లు ఉండకపోవచ్చని గ్లోబల్‌ సర్వేల్లో తేలింది. అక్టోబరు డిసెంబరు త్రైమాసికంలో కేవలం అతికొద్ది యాజమాన్యాలు మాత్రమే నియమాకాలు చేపట్టే అవకాశం ఉందని అంచనా. మన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లా§్‌ు మెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే మంగళవారం విడుదల చేసింది. 5131 కంపెనీలు దేశవ్యాప్తంగా సర్వే చేస్తే 19శాతం మంది మాత్రమే నియామకాల్లో కొంతపెరుగుదల ఉంటుందని వెల్లడించారు.

52శాతం మంది తమ కంపెనీ పేరోల్స్‌లో మార్పులు ఉండవని వెల్లడించారు. 28శాతం మంది నియామకాలు పెంచుతామోలేదో కూడా చెప్పలేమని తెలిపారు. వచ్చే మూడునెలలకుగాను ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లోనే కొంత కొత్త కొలువులపరంగా ఆశాజనకంగా ఉంటుందన్న సర్వేలు వెల్లడిస్తున్నాయి. జపాన్‌లో 26శాతం మందియాజమాన్యాలు వచ్చే మూడునెలల్లో నియామకాలు పెంచుతామని తైవాన్‌లో అయితే 21శాతం, అమెరికా 20శాతం కొత్తనియామకాలు చేపడతామని యాజమాన్యాలు చెపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాలవారీగా కూడా కంపెనీలు భిన్నమైన మార్గాలను అనుస రిస్తున్నాయి.

మాన్‌పవర్‌గ్రూప్‌ మొత్తం 59వేల మంది యాజమాన్యా లను ఇంటర్వ్యూలు చేసింది. 44 దేశాల్లో వివిధ ప్రాదేశిక ప్రాంతాల్లో ఈ సర్వే చేపట్టింది. 44దేశాల్లో 43 దేశాలకుగాను మానవవనరులు మరింతగా పెంచుకుంటామని చెపుతున్నారు. 44 దేశాలకుగాను 15 దేశాల్లో కొత్త నియామకాలు భారీగా ఉంటాయని అంచనా. 23 దేశాల్లో తక్కువస్థాయిలో మాత్రమే కొత్త నియామకా లుంటాయని అంచనా. అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో స్పెయిన్‌ ముందు వరుసలో ఉంది. చెక్‌రిపబ్లిక్‌లో రెండుశాతం, అర్జంటైనా మూడుశాతం, కోస్టారికా మూడుశాతం, స్విట్జర్లాండ్‌లో మూడుశాతం మాత్రమే వచ్చే మూడు నెలల్లో నియామ కాలుంటాయని అంచనా. పరిపాలనా విభాగం, విద్యారంగంలో 27శాతం నియామకా లుంటాయి.

ఆ తర్వాత ఉత్పత్తి రంగం, మైనింగ్‌, నిర్మాణం రంగాలు తర్వాత స్థానాల్లో వరుసగా 16శాతం, 13శాతంగా ఉన్నాయి. రవాణా రంగపరంగా 11శాతం కొత్త నియామ కాలుంటాయని అంచనా. తూర్పు ప్రాంతంలో నికరంగా ఉపాధి కల్పన 38శాతంగా ఉంది. మొత్తం మూడు రీజియన్లలో దక్షిణ, పశ్చిమ, ఉత్తరం వైపు నియామకాలు 19శాతం, 18శాతం, 16శాతంగా ఉంటుందని అంచనా. మాన్‌పవర్‌ గ్రూప్‌ ఉపాధి కల్పన సర్వే త్రైమాసికం వారీగా నిర్వహిస్తారు. దీన్నిబట్టి రానున్న మూడునెలల్లో ఉద్యోగ నియామకాల సరళి వెల్లడి కావడంతో పాటు నిరుద్యోగులకు కొంత ఆశలు పెరుగుతాయి.