రైల్వేల్లో ప్రైవేటీకరణ షురూ!

railways
railways

న్యూఢిల్లీ: రైల్వేల్లో పాక్షిక ప్రైవేటీకరణకు మంత్రిత్వశాఖ పునాదులు వేస్తోంది. తొలివిడతగా రాజధాని, శతాబ్ది, ప్యాసింజర్‌రైళ్లను ఎంపికచేసిన రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లుసైతం నడిపేవిధంగా కొత్త విధానాలను రూపొందిస్తోంది. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఈ వ్యూహాత్మక ప్రణాళికలు లోకోమోటివ్స్‌ విభాగంలో మరింతగా ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సమించాలని, అలాగే రోలింగ్‌స్టాక్‌, రైల్వేస్టేషన్ల ఆధునీకరణల్లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని సూచించింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి మరింతగా పెట్టుబడులను రాబట్టేందుకు కొన్ని రూట్లలో ప్యాసింజర్‌రైళ్లను కూడా ఇవ్వాలని చూస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలు, పర్యాటక మార్గాల్లో ప్రైవేటు నిర్వహణకే అప్పగించడం శ్రేయస్కరమని భావిస్తోంది.

వీటిలో ప్రీమియం రైళ్లను కూడా కొన్నింటిని చేర్చింది. వాటిలో రాజధాని, శతాబ్ది రైళ్లు ఉన్నాయి. ఈ ప్రణాళికలో టెండరుదారు కనీసం నాలుగునెలలపాటు నిర్వహించాలి. ప్రయోగాత్మక పద్ధతిలో రెండురైళ్లను ఐఆర్‌సిటిసి వీరికి కేటాయిస్తుంది. ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలోనే నిర్దేశించిన రెండు పర్యాటక ప్రాంతాలకు ప్రధాన నగరాలను కలుపుతూ రూట్లను నిర్ణయిస్తారు. అవికూడా తక్కువ రద్దీ ఉన్న రూట్లు అయి ఉంటాయి. సంబంధిత అన్ని వర్గాలు, ఉద్యోగ సంఘాలనుసైతం ముందు సంప్రదింపులు జరిపి నిర్ణయించాలని అభిప్రాయపడుతోంది. న్యూ ఇండియా 2018 ప్రణాళిక కింద నీతి ఆయోగ్‌ ఈ రంగంలో మరింత పెట్టబడులు ప్రైవేటురంగం నుంచే రావాలని కోరుతోంది. ఈ చర్యవల్ల పెట్టుబడులు పెరిగి పనితీరు సామర్ధ్యం మరింత పెరుగుతుందని చెపుతున్నారు.

కోచ్‌ తయారీ, లోకోమోటివ్‌ ఉత్పత్తి, మరమ్మతుల్లో ఇపుడు ప్రైవేటు భాగస్వామ్యం ఉంది. ఇక భవన నిర్మాణ రంగాలకు చెంది వాటిలో కూడా ఉంది. ఇపుడు స్టేషన్ల ఆధునీకరణ కూడా చేర్చింది. ఇక్రా రేటింగ్‌ నివేదికప్రకారం రైల్వేస్టేషన్‌ల పునఃఅభివృద్ధి పథకం కింద మొత్తం 500 స్టేషన్లను రూ.1.1 లక్షల కోట్లతో ఆధునీకిరంచాలని నిర్ణయించింది. ఐదేళ్లకాలంపాటు నడిచే ఈ ప్రాజెక్టుల్లో మధ్యతరహా ప్రణాళికలు 1-3 ఏళ్లుగా ఉన్నాయి. 50 స్టేషన్లను రీడెవలప్‌మెంట్‌ కోసం చేపట్టింది. వీటి ఖర్చు సుమారు 10వేల నుంచి 20 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

ఈ స్టేషన్లలో వాణిజ్యపరమైన వృద్ధిని కూడా చూస్తోంది. ఐఆర్‌ఎస్‌డిసి ఇందుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 39 స్టేషన్లను ఐదు సిపిఎస్‌ఇలకు అప్పగించింది. ఎన్‌పిసిసి, ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులు, మేకాన్‌, రైట్స్‌, బ్రిడ్జెస్‌ అండ్‌ రూఫ్‌ కంపెనీకి అప్పగించింది. ఎన్‌బిసిసికి గతంలోనే పది రైల్వేస్టేషన్లను అప్పగించింది. ఇపిసి పద్ధతిలో పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఏడు స్టేషన్లలో ఆర్థిక సామర్ధ్యాన్ని బట్టి తీసుకుంటాయి. గత ఏడాది రైల్వేలు ప్రైవేటురంగ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. ఇందుకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు.

సాధారణప్రయోజనాల వ్యాగన్‌స్కీం కింద ప్రైవేటు పార్టీలు ప్రవేశిస్తాయి. అదానీగ్రూప్‌, జెఎస్‌డబ్ల్యు సిమెంట్‌, జిందాల్‌స్టిల్‌ అండ్‌పవర్‌, టాటాస్టీల్‌, రష్మి సిమెంట్‌, ఒరిస్సా మెటాలిక్స్‌ వంటివి ఆసక్తిచూపిస్తున్నాయి. మరికొనఇన స్కీంలు సరళీకృత వాగన్‌ పెట్టుబడులపథకం కింద వ్యాగన్‌ల లీజింగ్‌స్కీం, ఆటోమొబైల్‌ రవాణా ట్రైన్‌ ఆపరేటర్‌ పథకం, ప్రత్యేక రైలు రవాణా ఆపరేటర్‌ పథకం వంటి వాటిని కూడా రైల్వేశాఖ అమలుకు తెస్తోంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/